తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ప్రభుత్వ పాఠశాలలలో మొదటి రోజునే విద్యార్థిని,విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు ఏకరూప దుస్తులు . భద్రాద్రి కొత్తగూడెం జూన్ 12 తెలుగు వెలుగు )జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడు నందు నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విద్యార్థిని విద్యార్థుల అందరికీ మొదటి రోజునే పాఠ్యపుస్తకములు, నోట్పుస్తకములు మరియు స్కూల్ యూనిఫామ్ దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. తరగతి టైం టేబుల్ కూడా వేసుకొని టీచింగ్ క్లాస్ ను రేపటి నుండి ప్రారంభిస్తాం మని ఒక పక్కన పడిబాట కార్యక్రమం కూడా నిర్వహించుకుంటూ విద్యాబోధన తరగతులను కూడా నిర్వహించడం జరుగుతుంది అని ఈ రోజు సుమారుగా 50 మంది విద్యార్థులు బడికిరావటం జరిగింది. అందరికి కూడా పాఠ్య పుస్తకములు పంపిణీ చేయడం జరిగింది అని కొత్త సంవత్సరం ప్రారంభానికి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానోపాధ్యాయులు తప్పేట లక్ష్మీనరసయ్య తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ