Friday, 19 June 2026 04:31:41 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

ఏఐటియుసి కృషి వల్ల అండర్ గ్రౌండ్ అన్ ఫిట్ ఐన మైనింగ్ స్టాప్ కు సర్ఫేస్ లో సూటబుల్ జాబ్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసిన యాజమాన్యం.

Date : 30 October 2025 07:19 PM Views : 439

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ వెల్లడి.సింగరేణి లో అనారోగ్యం తో మెడికల్ అన్ ఫిట్ ఐన మైనింగ్ స్టాప్, ట్రేడ్స్ మెన్ లకు ఏఐటియుసి కృషి వల్ల సర్ఫేస్ లో సూటబుల్ జాబ్ ఇచ్చేందుకు సింగరేణి యాజమాన్యం గురువారం ఆదేశాలు జారీ చేసిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. సింగరేణి లో గతంలో గుర్తింపు సంఘం గా ఉన్న ఏఐటియుసి హయాం లో అనారోగ్యం తో మెడికల్ అన్ ఫిట్ ఐన మైనింగ్ స్టాప్, ట్రేడ్స్ మెన్స్ కు సర్ఫేస్ లో సూటబుల్ జాబ్ ఇచ్చే వారని, కాని 2018 మార్చి నుంచి దానిని నిలిపి వేసి సర్ఫేస్ లో జనరల్ మజ్దూర్, క్యాటగిరి వన్ లో పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని, దీని వల్ల సింగరేణి లో చాలా మంది మైనింగ్ స్టాప్, ట్రేడ్స్ మెన్స్ చాలా మానసికంగా, ఆర్థికంగా నష్టపోయారని, దీనికి కారణం అప్పటి గుర్తింపు సంఘం టిబిజికెఎస్ యాజమాన్యం అవలంబించిన కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకోవడం లో వైఫల్యం చెందినందునే మైనింగ్ స్టాప్, ట్రేడ్స్ మెన్స్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నో సార్లు వీరి గురించి ఏఐటియుసి అనేక విధాలుగా ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు మరియు మైనింగ్ స్టాప్, ట్రేడ్స్ మెన్స్ చేసిన ఆందోళనల కు ఏఐటియుసి అండగా నిలిచినప్పటికిని టిబిజికేఎస్ సంఘం యాజమాన్యం పై ఒత్తిడి చేయడం లో వైఫల్యం చెందిందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి లో 2023 లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో మైనింగ్ స్టాప్ కు, ట్రేడ్స్ మెన్ లకు అండర్ గ్రౌండ్ లో అన్ ఫిట్ ఐన వారికి సూటబుల్ జాబ్ ఇప్పిస్తామని ఏఐటియుసి ఇచ్చిన హామీ మేరకు యాజమాన్యం పై ఒత్తిడి చేసి నవంబర్ 28,2024 న జరిగిన డైరెక్టర్ ఫా స్థాయి స్ట్రక్చర్ కమిటీ సమావేశం మరియు మార్చి 7, 2025 న సి అండ్ ఎండి స్థాయి సమావేశం లో పట్టుబట్టి గత ఒప్పందం ను అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. యాజమాన్యం దీనిపై అంగీకరించి ఒక కమిటీ వేసి పరిష్కారం చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం గా అనగా మార్చి 2018 నుండి జూలై 2025 వరకు జరిగిన కార్పొరేట్ మెడికల్ బోర్డు లో అండర్ గ్రౌండ్ లో అన్ ఫిట్ ఐన మైనింగ్ స్టాప్, ట్రేడ్స్ మెన్స్ కు సర్ఫేస్ లో సూటబుల్ జాబ్ ఇచ్చేందుకు యాజమాన్యం గురువారం ఆదేశాలు జారీచేసిందని ఆయన పేర్కొన్నారు, ఇది ఏఐటియుసి సాధించిన ఘనత అని ఆయన పేర్కొన్నారు. ఏఐటియుసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా ఒకటొకటిగా గా అమలు చేసేందుకు కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కొన్ని కార్మిక సంఘాలు ఏఐటియుసి పై అనవసరపు విమర్షలు చేస్తూ కార్మికుల ను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా మిగతా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: