Monday, 20 April 2026 05:40:20 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

చేతి వృత్తులకు భవిష్యత్తులో విలువ పెరుగుతుంది – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 29 July 2025 07:06 PM Views : 598

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో "ఫర్నిచర్ ప్రొడక్షన్ అసిస్టెంట్" శిక్షణకు మొదటి బ్యాచ్ ఎంపిక పూర్తయిందిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువత చేతివృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం పాల్వంచలోని ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన "ఫర్నిచర్ ప్రొడక్షన్ అసిస్టెంట్" కోర్సుపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ "కంప్యూటర్ ప్రోగ్రామ్ చేయగలదు కానీ ఫర్నిచర్ తయారు చేయలేదు. ఈ వృత్తుల్లో స్థిరత, ఆదాయం రెండూ ఉంటాయి" అని పేర్కొన్నారు.ఈ శిక్షణ పూర్తి అయిన అనంతరం నెలకు రూ.15,000 నుండి రూ.30,000 వరకు పారితోషికంతో ఉద్యోగ అవకాశాలు ఉండగా, కొందరికి రూ.1 లక్ష వరకు వేతనాలు అందే అవకాశముందని కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని యువత వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో NSTI – FFSC, హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించాయి. ఫర్నిచర్ అండ్ ఫిటింగ్స్ స్కిల్ కౌన్సిల్ (FFSC) రీజనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పీ. ఆధ్వర్యంలో శిక్షణా అవకాశాల గురించి సమగ్రంగా వివరించారు.డ్రాయింగ్ & టెస్ట్ ద్వారా ఎంపిక – మొదటి బ్యాచ్‌కు శుభారంభంఈ కార్యక్రమంలో నిర్వహించిన డ్రాయింగ్ మరియు టెస్ట్ ద్వారా మొదటి బ్యాచ్‌గా 10 మంది గిరిజన యువత ఎంపికయ్యారు. వారు NSTI హైదరాబాద్‌లో మూడు నెలల పాటు శిక్షణ పొందనున్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు: 1. డి. రామ్ చరణ్ (బెండలపాడు) 2. కె. జంపన్న బాబు (బొజ్జిగుప్ప రామచంద్రుని పేట) 3. కె. వెంకటేష్ (బెండలపాడు) 4. కె. అఖిల్ (ఇల్లందులపాడు తండా) 5. డి. అర్జున్ రావు (వడ్డే రంగాపురం) 6. బి. రాజు (మణుగూరు) 7. బి. విష్ణువర్ధన్ (రామవరం) 8. కె. ప్రసాద్ (రామచంద్రుని పేట) 9. కె. రామకృష్ణ (బొజ్జిగుప్ప) 10. ఎస్. వీరేంద్ర గోపాలస్వామి (బెండలపాడు) ప్రతి అభ్యర్థికి జిల్లా యంత్రాంగం ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.5,000 చొప్పున అందించనున్నారు.CSR ద్వారా వసతి & భోజనం – అభిమన్య ఇంటీరియో డొనేషన్. Abhimanya Interio Pvt. Ltd. Managing Director దిలీప్ వర్మ , ఎంపికైన అభ్యర్థుల కోసం హైదరాబాద్‌లో మూడు నెలల పాటు వసతి మరియు భోజన ఖర్చుల నిమిత్తం రూ.1,12,200 విలువైన చెక్కును కలెక్టర్ కు అందజేశారు. ఈ సాయం Corporate Social Responsibility (CSR) పథకం ద్వారా చేయబడింది.ఈ సందర్భంగా కలెక్టర్ దిలీప్ వర్మ ను ప్రత్యేకంగా అభినందించారు.FFSC Regional Skill Chapters – South Vice President ప్రశాంత్ పీ. మాట్లాడుతూ, ఫర్నిచర్ రంగంలో పాన్ ఇండియా స్థాయిలో నెలకు రూ.1 లక్ష వరకు సంపాదించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈరోజు ఎన్నికైన అభ్యర్థులకు ఆగస్టు 4 తారీకు నుండి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.కార్యక్రమంలో Skill Academy Assistant Manager అబ్బోజీ సంతోష్ చారి, మెప్మా PD రాజేష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా కార్పెంటర్ల సంఘం అధ్యక్షుడు రామడుగు రామాచారి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :