తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు భూక్య రాజేష్ నాయక్ మాట్లాడుతూ భూభారతి చట్టం రైతుల పాలిట శాపంగా మారిందని రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా చేస్తున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో నీ లోపాల వలన ఇప్పటివరకు మండల వ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు కూడాను పట్టా పాస్ బుక్కులు పొందలేకాపోయారు . సాదా బై నామ పేరుతో రైతుల ఉసురు తీస్తున్నారు. ఒకపక్క రైతు బంధు రైతు, భరోసా ఎగుడుతూ మరోపక్క రైతులు వ్యవసాయానికి పనికి వచ్చేటటువంటి యూరియాను పొందలేక వ్యవసాయంలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. పోనీ ఎవరికైనా వారి భూమి అత్యవసరం నిమిత్తం అమ్ముకుందామంటే వారికి పట్టా కూడా లేకుండా పోతున్నాయి. దీనంతటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భూ భారతి చట్టం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, కలెక్టర్ స్వయంగా ప్రారంభించి రైతుల దగ్గర నుంచి పట్టాకు సంబంధించిన పాత పహనీలు, జిరాక్స్లు, అన్నియును కూడా తీసుకొని సంవత్సరం నర కాలం గడుస్తున్న ఇంతవరకు ఏ ఒక్కరికి ఒక పట్టా పాస్ బుక్ కూడా మంజూరు చేయలేదు. మండల వ్యాప్తంగా అనేక మంది రైతులు వారి సొంత భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికంటే గతంలో ఉన్నటువంటి ధరణి అయిన కాస్త నయం అనే పరిస్థితికి రైతులు వచ్చారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలం పరిస్థితే ఇలా ఉంటే, ఇంకా మిగిలిన మండలాలు వాటి పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ప్రభుత్వం తీరును విమర్శించారు. దీనికి తోడు రైతు భరోసాను అమలు చేయకుండా శాటిలైట్ ద్వారా సర్వే అని చెప్పి, ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ అనీ రైతులకు తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నారు. పాస్ బుక్కు లేని రైతులు యూరియాను ఎలా ఆన్లైన్ చేసుకుంటారు అని ఎద్దేవా చేశారు. వ్యవసాయ సీజన్ అంతా అయిపోతున్న కూడా ఇంతవరకు రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేయలేదు. రైతు లేనిదే రాజ్యం లేదు . అలాంటిది రైతులకు దగా చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రులు తక్షణమే ఈ యొక్క భూభారతి లో నమోదైనటువంటి పట్టాలను వెంటనే మంజూరు చేసి, వాటికి రైతు భరోసాను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ