Sunday, 19 April 2026 01:58:40 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

సింగరేణికి అన్యాయం చేయాలని చూస్తే సహించబోం : కార్మిక సంఘం ఎఐటియుసి

Date : 17 December 2025 03:30 PM Views : 258

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అదాని, మెగా, ఏఏంఆర్, కంపెనీలకు ఇస్తే అడుగుపెట్టనివ్వం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయుసీ అధ్యక్ష, కార్యదర్శులు,వాసిరెడ్డి సీతారామయ్య, కోరిమి రాజకుమార్ స్పష్టం శేషగిరిభవన్ లో గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి ప్రెస్ మీట్ ప్రభుత్వం చేపడుతున్న బొగ్గు బ్లాక్ వేలంలో సింగరేణి బొగ్గు పరిశ్రమకు అన్యాయం చేయాలని చూస్తే సహించేదిలేదని, సింగరేణి బొగ్గు పరిశ్రమను పరిరక్షించు కుంటామని ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శి సింగరేణి గుర్తింపు సంఘం నేతలు వాసిరెడ్డి సీతారామయ్య,కొరిమి రాజకుమార్,తెలిపారు. బుధవారం కొత్తగూడెం శేషగిరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాసిరెడ్డి సీతారామయ్య,కొరిమి రాజకుమార్ మాట్లాడుతూ మణుగూరు, పీకే ఓపెన్ కాస్ట్ డిప్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టుల సంబంధించి సింగరేణి బొగ్గు పరిశ్రమకే అవకాశం ఇవ్వాలని వాసిరెడ్డి సీతారామయ్య,కొరిమి రాజకుమార్,డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల తవ్వకాల పొడిగింపుకు సంబంధించి సింగరేణి పరిశ్రమకు మాత్రమే అవకాశం ఇచ్చి తీరాలని, లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. సింగరేణి సంస్థ కాకుండా అదని మెగా కృష్ణారెడ్డి,ఏఏంఆర్ లాంటి ప్రైవేటు కంపెనీలకు బొగ్గు బ్లాక్లను ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల తవ్వకాల పొడిగింపులను అప్పగిస్తే ఆ సంస్థలను అడుగుపెట్టనివ్వమని సీతారామయ్య, రాజకుమార్,తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమ తరహాలు సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మణుగూరు పీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను సింగరేణికి అప్పగించకపోతే యావత్తు సింగరేణి పరిశ్రమకే నష్టం జరిగే పరిస్థితి తలెత్తుతుందన్నారు. కంపెనీ మనుగడే ప్రశ్నార్థకమే పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. అలాగే డీఎంఎఫ్, సింగరేణి సిఎస్ఆర్ నిధు లు స్థానిక ప్రాంతాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. సింగరేణి బొగ్గు పరిశ్రమను పరిరక్షించుకోవడం కోసం, బొగ్గు బ్లాక్లను సాధించుకోవడం కోసం పరిరక్షణ సమితి పేరిట అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా,కార్మికసంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని స్పష్టం చేశారు. బొగ్గు పరిశ్రమను కాపాడుకునేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శిలు మల్లికార్జునరావు,రాంగోపాల్,రమణమూర్తి,ఎఐటియుసి నాయకులు వీరస్వామి,క్రిస్టోఫర్,ఎర్రగని కృష్ణయ్యా,సందబోయన శ్రీనివాస్, హుమాయూన్,రాములు,బండారి మల్లయ్య, మండల రాజేశ్వరరావు,లక్ష్మీనారాయణ, నరేష్,చంద్రయ్యా తాటిదారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :