తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రధాన కేంద్రంలో తెలంగాణ యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే బెస్ట్ బతుకమ్మ అవార్డ్స్ కార్యక్రమం బ్రోచర్ ను శుక్రవారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. తెలంగాణ సాంప్రదాయ బతుకమ్మ అవార్డ్స్ పోటీలలో పాల్గొనే మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మకు సంబంధించిన రెండు నిమిషాల వీడియోను, ఒక సెల్ఫీ ఫోటోను ఈ వాట్సాప్ సెల్ నెంబర్లు 9493517515, 8185005818, కు పంపించిన వీడియోలను పంపించవలసి ఉంటుంది. ఈ బెస్ట్ బతుకమ్మల పోటీలకు మీరు పంపిన బతుకమ్మల వీడియోల ద్వారా సెలక్షన్ కమిటీ ఉత్తమ బతుకమ్మను నిర్ధారించి విజేతలను ప్రకటిస్తారు. కావున ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనే పాల్గొని ఆకర్షణ ఏమైనా బహుమతులు గెలుచుకోవాలని తెలంగాణ యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు అనిశెట్టి సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాష , యూనియన్ గౌరవ అధ్యక్షులు రామ్ నరసింహారావు, కమలాకర్ , లక్ష్మణ్, రవీంద్రనాథ్ , వేణు, మహేష్ , అశోక్ తదితరులు పాల్గొన్నారు .
Admin
తెలుగు వెలుగు టీవీ