Friday, 19 June 2026 10:11:33 PM
# బూత్ స్థాయిలో సమగ్ర పర్యవేక్షణతో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి # ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడి. జిల్లా కలెక్టర్ అంకిత్. # భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్. # రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో. జిల్లాలో యూరియా బుకింగ్‌లలో 72.66 శాతం పంపిణీ పూర్తి – జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు. # భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు. # ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి. # లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్.

Date : 19 June 2026 08:06 PM Views : 17

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సాదా బైనామా, రీ-సర్వే ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలి.రెవెన్యూ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాలి.భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, సాదా బైనామా, నాన్-కడాస్ట్రల్ గ్రామాల రీ-సర్వే ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సేవలను ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి పలు జిల్లాల కలెక్టర్లతో భూధార్ సర్వే, భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, నాన్-కడాస్ట్రల్ గ్రామాల రీ-సర్వే, నక్షా కార్యక్రమం తదితర అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా పురోగతిని పరిశీలిస్తూ పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి ఐడీఓసీ కాలనీలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. జిల్లాలో భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, రీ-సర్వే, నక్షా కార్యక్రమాల పురోగతిపై వివరాలను రాష్ట్ర అధికారులకు నివేదించారు.ఈ సమావేశంలో ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాసరావు, మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :