తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 25 తెలుగు వెలుగు)జూలూరుపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బేతలపాడు గ్రామం నుంచి పడమటి నరసాపురానికి మిరప కూలీలు మంగళవారం ఉదయం టాటాఏస్ మీద వెళ్తున్నారు. బేతాళపాడు గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై నుంచి అదుపుతప్పి టాటాఏస్ వాగులో పడింది. ప్రమాదంలో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో ట్రాలీలో 20 మంది కూలీలు ఉన్నారు. జూలూరుపాడు పోలీసులు తక్షణ సహాయ చర్యలు చేపట్టి గాయాలైన వారిని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ