Sunday, 19 April 2026 03:29:18 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

అంతర్ పంటల సాగుతో రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యం కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 15 September 2025 04:37 PM Views : 357

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర పంటల సాగుతో రైతులు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.సోమవారం ములకలపల్లి మండలం మూక మామిడి పంచాయతీ పరిధిలోని గుట్టగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద చేపట్టిన వెదురు సాగును జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులు కనితి భద్రయ్య, కనితి రాధా, కనితి పొట్టమ్మల పొలాల్లో స్వయంగా వెదురు మొక్కలు నాటి, గ్రామీణ వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. అనంతరం మొగరాల గొప్ప గ్రామంలో రైతు కీసర సుజాత వెదురు సాగును మొక్కను నాటి ప్రారంభించారు .అనంతరం కుండ్రు వెంకటమ్మ ఎకరం పొలంలో సాగు చేస్తున్న మునగ తోటను, గడ్డం వారి గుంపు గ్రామంలో రైతు కొమ్ము బుచ్చన్న సాగు చేస్తున్న రెండెకరాల మునగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన కలెక్టర్ , “ప్రతి రైతు సంప్రదాయ పంటలతో పాటు కొత్త పంటలను ప్రయత్నించాలి. అంతర్ పంటల సాగు ద్వారా తక్కువ భూమిలోనూ అధిక ఆదాయం పొందవచ్చు. ఆయిల్ పామ్ తోటల్లో మునగ, బెండలను వేసుకుంటే అదనపు ఆదాయం వస్తుంది. వెదురు సాగులో పెసలు, బొబ్బర్లు, మినుములు, రాగి వంటి పంటలు వేసుకుంటే కుటుంబ ఆదాయం మరింతగా పెరుగుతుంది అని అన్నారు. రైతు వేసే ప్రతి పంట కేవలం మీ కుటుంబానికే కాదు, గ్రామ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుంది. కొత్త పంటలపై నమ్మకం పెట్టుకుని సాగు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. వెదురు సాగుకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. మీరు పండించే వెదురును బెండలంపాడు బ్యాంబు క్లస్టర్ ద్వారా తయారీ ఉత్పత్తులకు వినియోగించి సులభంగా మార్కెటింగ్ చేయవచ్చు. దీని ద్వారా మీరు స్థిరమైన ఆదాయం పొందడమే కాకుండా గ్రామంలోనే ఉపాధి అవకాశాలు కూడా సృష్టించవచ్చు అని అన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ మూక మామిడి గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించి సంబంధిత అధికారులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, తాసిల్దార్ గన్యా నాయక్, ఎంపీ ఓ వెంకటేశ్వర్లు, ఏటీఎం వెంకయ్య, ఏపీవో హుస్సేన్, ఎల్ డి ఎం సమ్మక్క మరియు రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :