తెలుగు వెలుగు టీవీ - వార్తలు / లక్ష్మీదేవిపల్లి : విశ్వసనీయ సమాచారం మేరకు లక్ష్మిదేవిపల్లి ఎస్సై రమణ రెడ్డి తన సిబ్బందితో కలిసి లోతువాగు అటవీ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ఆటోలో మహబూబాబాద్(D) రంగశాయిపేటకు చెందిన బండి వెంకటేశ్వర్లును పట్టకున్నారు. అతని వద్ద నుంచి రూ.15 లక్షల విలువైన 31.93 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిషేధిత గంజాయి రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ