తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : దమ్మపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కల్చరల్ స్పోర్ట్స్ యాన్యువల్ డే వేడుకల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడల్లో మంచి ప్రతిభ కనబరచిన వారిని అభినందించారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పగడాల రమాదేవి, ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కక్కిరాల రమేష్ , టౌన్ అధ్యక్షులు చిన్నశెట్టి చిట్టిబాబు, కేవీ సత్యనారాయణ, పగడాల రాంబాబు గారు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ