తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ శిక్షణా కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన బాధ్యతను గుర్తుంచుకొని మేయర్లు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు గ్రామపంచాయతీ సర్పంచులు తమ తమ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా పని చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సక్రమంగా చేరవేసేందుకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ