తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్త గూడెం జులై 20 (తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో ఆషాడ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా ముత్యాలమ్మ కు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలను వండి బోనంతో గ్రామదేవత అయినా ముత్యాలమ్మ కు మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ మా గ్రామం నందు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ముత్యాలమ్మకు బోనాలు సమర్పిస్తామని, ముత్యాలమ్మ చల్లని చూపుతో పాడిపంటలు బాగా పండుతాయని అందుకే అమ్మకు ప్రతి ఏటా బోనమెత్తుతామని అన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ