Sunday, 19 April 2026 01:58:05 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 24 December 2025 08:28 PM Views : 337

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో LSC (లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్) Redington Foundation (COLTE) సహకారంతో స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ – ప్లేస్‌మెంట్ సపోర్ట్ కార్యక్రమాన్ని బుధవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో లాజిస్టిక్స్ రంగంలో LSC (Logistics Skill Council) మరియు Redington Foundation (COLTE) సంస్థల ద్వారా రీయల్‌టైమ్ ఫోర్క్‌లిఫ్ట్ ఆపరేటర్, సప్లై చైన్ అసోసియేట్, ఎగుమతి–దిగుమతి (Export–Import) ఎగ్జిక్యూటివ్ కోర్సులలో పూర్తిగా ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు వసతి, భోజన సౌకర్యాలతో పాటు 100 శాతం ప్లేస్‌మెంట్ సపోర్ట్ కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం నెలకు సుమారు రూ.13,000 నుండి రూ.18,000 వరకు జీతంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నందున, జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశమని జిల్లా కలెక్టర్ తెలిపారు.జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఈ ఓరియంటేషన్ కార్యక్రమానికి మొత్తం 51 మంది యువతీ, యువకులు హాజరయ్యారు. వారికి కౌన్సెలింగ్ మరియు మౌఖిక పరీక్షలు నిర్వహించగా, శిక్షణ విధానం, ఉద్యోగ స్వరూపం (జాబ్ ప్రొఫైల్) వివరాలను LSC సెంటర్ హెడ్ మధురాణి గారు మరియు మేనేజర్ మౌనిక గారు వివరించారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా 6 మంది రీయల్‌టైమ్ ఫోర్క్‌లిఫ్ట్ ఆపరేటర్, 13 మంది సప్లై చైన్ అసోసియేట్, 10 మంది ఎగుమతి–దిగుమతి ఎగ్జిక్యూటివ్ కోర్సులకు ఎంపికయ్యారు.ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ విద్యా చందన, ఏపిఎం వెంకయ్య, EDM సైదేశ్, సి.హెచ్. నాగ నంద్ (బీసీ కార్పొరేషన్) తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :