తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారుటేకులపల్లి మండలానికి చెందిన వాంకుడోత్ అశోక్ తాను బిఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసి ఉన్నానని జిల్లాలోని ఏటీఎంఏ ( అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) నందు ఔట్సోర్సింగ్ పరిధిలో ఒక పోస్టుని తనకు ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.జూలూరుపాడు మండలం సాయిరాం తండా కు చెందిన గుగులోతు వీరు తన కుటుంబ సభ్యులతో కలిసి తాటాకు ఇంటిలో నివాసం ఉంటున్నానని తేదీ. 26/2/2025 న కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా తన ఇల్లు పూర్తిగా దగ్ధమై పిల్లల సర్టిఫికెట్స్, భూమి కాగితాలు, నగదు అన్ని దగ్గం అయ్యాయని తాము నివసించడానికి నివాసం లేక ఇబ్బంది పడుతున్నామని డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం హౌసింగ్ పీడీ అధికారి గారికి ఎండార్స్ చేశారు.ఇల్లందుకు చెందిన పోకల రాధ తన తల్లి పోకల కోటమ్మ, గతంలో తల్లి పేరు మీద గృహపట్టా మంజూరయ్యిందని, (పట్టా నంబర్: 211). ప్రస్తుతం తన తల్లిదండ్రులు ఇద్దరూ మరణించగా, ఒంటరిగా ఉన్న తనను వారసురాలిగా గుర్తించి, వారసత్వ చట్ట ప్రకారం తమ ఇంటికి సంబంధించి గృహ పట్టాను తన పేరపై మంజూరు చేయవలసిందిగా కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి, తగిన చర్యలు నిమిత్తం ఇల్లందు తహసీల్దార్‌కు ఎండార్డ్ చేయబడింది.మణుగూరు కు చెందిన బత్తుల రాములు సర్వే నెంబర్ 138/1559 లో ఒక ఎకరం 20 కుంటల భూమి ఉన్నదని దానికి రైతు భరోసా డబ్బులు కూడా వస్తున్నాయని అట్టి పొలం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటులో పోతున్నదని తనకు వ్యవసాయమే జీవనాధారంమని, కావున తన భూమిని తనకు ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం మణుగూరు తాసిల్దారు కు ఎండార్స్ చేశారు. జూలూరుపాడు మండలం అనంతారం గ్రామానికి చెందిన గడిగ వెంకటేశ్వర్లు తన కుమారుడు గడిగ జస్వంత్ ఎనిమిదో తరగతి చదువుటకు చుంచుపల్లి బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల నందు నందు సీటు ఇప్పించగలరని ఒకవేళ చుంచుపల్లి నందు సీటు రాలేనిచో మరి ఎక్కడైనా సీటు ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం ఆర్ సి ఓ కి ఎండార్స్ చేశారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ