తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ చౌకధరల దుకాణాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అవసరమైన బియ్యం నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ఈ చౌకధరల దుకాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఇప్పటి వరకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లి సరుకులు తీసుకోవాల్సిన ఇబ్బందులు ఎదుర్కొనేవారని ఇప్పుడు చిన్నగొల్లగూడెం గ్రామంలోనే దుకాణం ప్రారంభం కావడంతో గ్రామ ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కక్కిరాల రమేష్, చిన్నశెట్టి యుగంధర్, దమ్మపేట జిసిసి అధికారి భూక్య వెంకటేశ్వరరావు ,ఉపసర్పంచ్ ముత్తిన రామకృష్ణ, యాట్ల శివ గుర్రం మల్లేష్ మచ్చల శివ ఆరుమూళ్ళ పవణ్ కుమర్, రావుల అప్పారావు, పూచి గోపి, మచ్చల పండు, రావుల రాంబాబు, తాళ్ళ శ్రీరామ్ మూర్తి, బంటు రంగా, కౌలూరి రాము, సంగసాని రాంబాబు, మచ్చల నాగరాజు, గన్నవరపు సాయి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ