తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు పీఎస్సీ పరిధిలో జాతీయ క్షయ వ్యాధి నిర్ములనా కార్యక్రమం లో భాగంగా వరల్డ్ టీబీ డే సందర్బంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా Dr.వెంకటేశ్వర్లు MO ఆధ్వర్యంలో phc సిబ్బంది తో ర్యాలి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువమంది మరణానికి కారణమవుతున్న అంటువ్యాధి టీబీ. దీని కారణంగా 2023లో అన్ని దేశాల్లో కలిపి 12,50,000 మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనావేసింది. ఓ బ్యాక్టీరియా ద్వారా క్షయ వ్యాధి వ్యాపిస్తుంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. టీబీ బారిన పడ్డ వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఉమ్మినప్పుడు ఇది వ్యాప్తిచెందుతుంది. ఈ వ్యాధి ప్రభావం భారత్‌లో చాలా ఎక్కువగా ఉంది. ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు ఈ వ్యాధి కారణంగా చనిపోతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ