తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు కక్షిదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11 బెంచీలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడానికి కక్షిదారులు పెద్ద సంఖ్యలో రావడం అభినందనీయమని పేర్కొన్నారు. దీనివల్ల కేసులు పరిష్కారం కావడంతో పాటు, ఇరువర్గాల మధ్య సామరస్యం పెరుగుతుందన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ