తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 21 తెలుగు వెలుగు)జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన ఓ మహిళ తన కూతురుతో కలిసి కొత్తగూడెం వెళ్లేందుకు జూలూరుపాడు లోని బస్టాండ్ వద్ద బస్సు కోసం నిరీక్షిస్తుంది. ఈ క్రమంలో ఆమె మెడలోని రెండు తులాల నల్లపూసల గొలుసు జారి కింద పడిపోయింది. ఈ క్రమంలో మండలంలోని అన్నారుపాడు గ్రామానికి చెందిన కొమ్మిన్ని శోభన్ బాబుకు నల్లపూసల గొలుసు దొరికింది. సదరు వ్యక్తి జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, హెడ్ కానిస్టేబుల్ దయానంద్ సమక్షంలో రూ 2 లక్షలు విలువ చేసే నల్లపూసల గొలుసు ను మహిళకు అప్పగించాడు. దీంతో ఎస్సై రవి మాట్లాడుతూ ఎవరికి ఏమైతే నాకేం లే అనుకునే ఈ రోజుల్లో వెయ్యి రూపాయలు దొరికితేనే జేబులో వేసుకుని వెళ్లే వాళ్ళు ఉన్నారు కానీ 2 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాన్ని సదరు పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించిన శోభన్ బాబును అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ