Friday, 19 June 2026 05:50:16 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

జన సంద్రంలా సాగిన చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ

Date : 14 November 2025 06:12 PM Views : 163

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మిదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి ప్రకాశం స్టేడియం వరకు పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో అక్టోబర్ 15 వ తేదీ నుండి ఈ రోజు వరకు నెల రోజుల పాటు చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం పేరుతో అనేక అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు.లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి ప్రకాశం స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీలో స్థానికులు,విద్యార్థులు,ప్రజాప్రతినిదులు,పుర ప్రముఖులు తదితరులు బారీ సంఖ్యలో పాల్గొన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సుమారు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా నిర్వహించిన "చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం" అవగాహనా కార్యక్రమాల ముగింపు సభ ఈ రోజు జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో అట్టహాసంగా జరిగింది.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా గౌరవ జిల్లా జడ్జి పాటిల్ వసంత్,జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్,ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యలు పాల్గొన్నారు.ఈ నెల రోజుల ప్రచార కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం యువతను, విద్యార్థులను మాదక ద్రవ్యాల (డ్రగ్స్) కోరల నుండి రక్షించడం, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై సమగ్ర అవగాహన కల్పించడం.జిల్లాలోని అన్ని మండలాలు,గ్రామాలు ముఖ్యంగా విద్యా సంస్థలు,కళాశాలల్లో పోలీసు అధికారులు,సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు,ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.విద్యార్థులు,యువత,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రజా ప్రతినిధులను ఈ అవగాహనా కార్యక్రమాల్లో భాగం చేశారు.ఈ ముగింపు సభలో సుమారుగా 5000 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.పాల్గొన్న వారందరికీ ఆయా స్కూల్లు,కళాశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి అలరించారు. చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం ముగింపు సభలో ముందుగా ​జిల్లా ఎస్పీమాట్లాడుతూ డ్రగ్స్ వాడకం అనేది వ్యక్తిగత సమస్య కాదని,ఇది సామాజిక రుగ్మత అని,దీనిపై పోలీసులతో పాటు ప్రతి పౌరుడు యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు.భవిష్యత్తులో కూడా ఈ చైతన్యం కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.ముగింపు వేడుకలో చురుకుగా పాల్గొన్న విద్యార్థులకు,స్వచ్ఛంద సంస్థలకు,జిల్లా ప్రజలకు,ప్రజాప్రతినిధులకు,అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.​జిల్లాను డ్రగ్స్ రహిత భద్రాద్రి గా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని,డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ధైర్యంగా తమకు తెలియజేయాలని పోలీసులు కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం తరఫున డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను,అభివృద్ధికి డ్రగ్స్ లేని సమాజం యొక్క ఆవశ్యకతను వివరించారు.నెల రోజుల పాటు ఎస్పీ సారధ్యలో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసు శాఖను మరియు చైతన్యం అవగాహనా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న యువతను,విద్యార్థులను అభినందించారు.డ్రగ్స్ సమస్య కేవలం చట్టాన్ని అమలు చేసే సమస్య కాదని,ఇది సామాజిక,ఆర్థిక అభివృద్ధికి పెద్ద అవరోధమని పేర్కొన్నారు.డ్రగ్స్ నిర్మూలనలో పోలీసులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం (విద్య, వైద్యం, సంక్షేమం) చురుగ్గా పాల్గొనాలని నొక్కి చెప్పారు.జిల్లాలోని విద్యా సంస్థలు మరియు హాస్టళ్లలో ప్రత్యేక నిఘా ఉంచాలని,అనుమానాస్పద కార్యకలాపాల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిర్భయంగా అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.యువత డ్రగ్స్‌కు బానిసలు కాకుండా ఉండేందుకు క్రీడలు,కళలు,సాంస్కృతిక కార్యక్రమాలు వంటి సానుకూల ప్రత్యామ్నాయాలను అలవాటు చేసుకుని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యువత సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.డ్రగ్స్ బారిన పడిన వారికి సరైన చికిత్స మరియు పునరావాస సౌకర్యాలు కల్పించడానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ​జిల్లా జడ్జి పాటిల్ వసంత్ మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన చట్టపరమైన అంశాలు,నేరస్తులకు విధించే శిక్షలు మరియు న్యాయ వ్యవస్థ పాత్ర గురించి వివరించారు.మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన చట్టం ఎంత కఠినంగా ఉంటుందో వివరించారు.​డ్రగ్స్ తయారీ,సరఫరా,విక్రయం మరియు వాడకం అనేది క్షమించరాని నేరం అని నొక్కి చెప్పారు.​ఈ చట్టం కింద నేరం రుజువైతే కఠిన కారాగార శిక్షలు,భారీ జరిమానాలు ఉంటాయని యువతకు సూచించారు.డ్రగ్స్ రహిత సమాజం కోసం న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడూ పోలీసులకు,ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులతో పాటు జిల్లా అటవీ అధికారి కృష్ణ గౌడ్,అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,జిల్లా రవాణాధికారి వెంకటరమణ,సూపరింటెండెంట్ జానయ్య,మున్సిపల్ కమీషనర్ సుజాత,డిఎస్పీలు రెహమాన్,చంద్రభాను,రవీందర్ రెడ్డి,సతీష్ కుమార్,మల్లయ్య స్వామి,అశోక్,సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: