Sunday, 19 April 2026 03:25:39 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ఫోరెన్సిక్ సైన్స్‌పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి : జిల్లా న్యాయమూర్తి పి.వసంత్

Date : 01 November 2025 05:25 PM Views : 306

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కోర్టు కేసులలో ఫోరెన్సిక్ సాక్ష్యం అనేది కీలకపాత్ర పోషిస్తుందని,న్యాయవాదులు దానిపై పక్కా అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయమూర్తి పి. వసంత్ తెలిపారు.శనివారం జిల్లా న్యాయవాదుల లైబ్రరీ హాల్‌లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.పీ.ఏ) ఆధ్వర్యంలో “కోర్టు కేసులలో ఫోరెన్సిక్ సాక్ష్యం ప్రాముఖ్యత” అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రో-బ్లాక్ డైరెక్టర్ మోహన్ ఎర్రగోళ్ల మాట్లాడుతూ,భారత సాక్ష్య చట్టంలో ఫోరెన్సిక్ సైన్స్‌కు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ,నేటి రోజుల్లో ఫోరెన్సిక్ పరిశోధనల అవసరం మరింత పెరిగిందని తెలిపారు.న్యాయవాదులు ఈరంగంలో నేర్చుకోవాల్సిన నైపుణ్యాలను ప్రస్తావిస్తూ పాలిగ్రఫీ టెస్ట్,ఫింగర్ ప్రింట్ అనాలసిస్,నార్కో అనాలిసిస్,హ్యాండ్ రైటింగ్ అనాలసిస్,సంతకం ధృవీకరణ వంటి అంశాల్లో పూర్తి సవివరమైన అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు విశిష్ట అతిథులుగా అదనపు జిల్లా జడ్జి ఎస్.సరిత,న్యాయమూర్తులు ఎం. రాజేందర్,కె.కిరణ్‌కుమార్, కె.కవిత, కె.సాయిశ్రీ,సెంకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ రాజమల్లు తదితరులు హాజరయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఐ.ఎల్.పీ.ఏ జిల్లా కన్వీనర్లు జే.గోపికృష్ణ,సుంకర భానుప్రియ,సీనియర్ న్యాయవాదులు పోసాని రాధాకృష్ణమూర్తి,జే.శివరామ్ ప్రసాద్,విజయ్ భాస్కర్ రెడ్డి,పి.నాగేశ్వరరావు,గంట వీరభద్రం,కిలారు పురుషోత్తం,గాజుల రామమూర్తి,బి.చిరంజీవి,నల్లమల ప్రతిభ,లక్ష్మీ సరిత,కాసాని రమేశ్,సహానజు పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అడపాల మహాలక్ష్మి,యెర్రా కామేష్,సాధిక్ పాషా,ఎర్రపాటి కృష్ణ,మారపాక రమేష్,అంబటి రమేష్,దొడ్డా సామంత్,మేకల దేవేందర్,పాల రాజశేఖర్,పగిడిపల్లి శ్రీకాంత్,వడ్లకొండ హరిప్రసాద్,ఇందిరా ప్రియదర్శిని,బేబీ షామిలి,దారావత్ రాధాకృష్ణ,యాస యుగేందర్ తదితర న్యాయవాదులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :