తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనవరి13న ముగ్గుల పోటీలు నిర్వహించ నున్నట్లు జిల్లా వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు తాటిపల్లి శంకర్ బాబు తెలిపారు. పర్వదినాలైనా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని ఈనెల 13వ తేదీన, స్థానిక కొత్తగూడెం క్లబ్ నందు వైశ్య ఫెడరేషన్, కొత్తగూడెం క్లబ్ కొత్తగూడెం క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆయన పేర్కొన్నారు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు ఒక చీర అందజేయడం జరుగునని వివరించారు. ప్రధమ బహుమతిగా ఐదు వేల రూపాయలు విలువగల పట్టుచీర , ద్వితీయ బహుమతిగా 3000 రూపాయలు విలువగల పట్టుచీర, తృతీయ బహుమతిగా 2000 విలువగల పట్టుచీర అందజేయడం జరుగుతుందన్నారు. ఈ ముగ్గుల పోటీలు కార్యక్రమంలో మహిళల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన "కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ