తెలుగు వెలుగు టీవీ - వార్తలు / బూర్గంపాడు : బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర పిహెచ్సిలో ఆశా వర్కర్లను వేధింపులకు గురి చేస్తున్న డాక్టర్, హెచ్ ఓలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పారు. ధర్నా చేసే క్రమంలో ఆశా కార్యకర్త శ్రీలత స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ