Sunday, 19 April 2026 02:10:20 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

వయోవృద్ధుల సంక్షేమంమే ప్రభుత్వ ప్రాధాన్యం: కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 19 November 2025 08:25 PM Views : 263

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జ్యోతి ప్రజ్వలన చేసి, కేక్ కటింగ్ చేసి వేడుకలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో కుటుంబాలు వయోవృద్ధులను నిర్లక్ష్యం చేసే పరిస్థితులు పెరిగిపోతున్నాయని, ఒంటరితనం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలు వృద్ధులను బాధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని తెలిపారు. పోషణ భృతి పొందాల్సిన వృద్ధులకు చట్ట ప్రకారం భృతి అందుకునేలా జిల్లా సంక్షేమ శాఖ, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లతో సమన్వయం చేసి వేగవంతమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డుల్లోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతున్నామని, వృద్ధులందరికీ ఆరోగ్య మరియు జీవన భీమా పథకాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక క్యాంపులును నిర్వహిస్తామని తెలిపారు.అలాగే కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానలో వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్, జిరియాట్రిక్ వార్డ్‌ను ఏర్పాటు చేయించి మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామని, స్పెషలిస్ట్ డాక్టర్లతో వెల్‌నెస్ సెషన్లు నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. వృద్ధులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ మోసాలు, ఆన్‌లైన్ ఫ్రాడ్‌లను అరికట్టేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్‌కు సంబంధించిన పెండింగ్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ వృద్ధుల కోసం ప్రభుత్వం అందిస్తున్న 2016 రూపాయల చేయూత పెన్షన్‌ను క్రమంగా అందజేస్తున్నామని, కొత్త దరఖాస్తుల కోసం ఆన్‌లైన్ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రచారం చేసి అర్హులందరికీ దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. 60 ఏళ్లు నిండిన మహిళలు పదిమంది గ్రూపులుగా ఉన్నట్లయితే వారికి బ్యాంకుల ద్వారా రివాల్యూషన్ ఫండ్స్ అందించే సదుపాయం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వృద్ధులందరూ తప్పనిసరిగా ఆరోగ్య భీమా పొందేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.అనంతరం వృద్ధాశ్రమాల నిర్వాహకులు, వయోవృద్ధుల అసోసియేషన్ సభ్యులు, వృద్ధుల సంక్షేమానికి సేవలందిస్తున్న వ్యక్తులను సన్మానించారు.ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలు, అభ్యర్థనలు జిల్లా కలెక్టర్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు సురేష్, సందీప్, కృష్ణయ్య, శివప్రసాద్, యూసఫ్, శివరామ్, భూషణ్ రావు, వెంకటేశ్వర్లు, సిడిపివోలు లక్ష్మీ ప్రసన్న, పద్మశ్రీ, వరప్రసాద్, నరేష్, ప్రవీణ్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు, వయోవృద్ధులు మరియు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :