తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కార్మికుల పలు సమస్యలపై డైరెక్టర్ ‘పా’ గౌతమ్ పొట్రు, ఐఏఎస్ అధ్యక్షతన కొత్తగూడెం ఇల్లెందు క్లబ్ నందు శుక్రవారం నాడు గుర్తింపు కార్మిక సంఘం (ఏఐటియూసి) రాష్ట్ర అధ్యక్షులు వి.సీతారామయ్య , జనరల్ సెక్రెటరీ కె. రాజ్ కుమార్, అన్ని ఏరియాల నాయకులతో 51 వ నిర్మాణాత్మక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశం లో సంస్థ డైరెక్టర్ ‘పా’ గౌతమ్ పొట్రు, ఈ సమావేశాన్ని ఉద్దేశించి గుర్తింపు సంఘం నాయకులతో మాట్లాడుతూ సంస్థ అభివృద్ధిలో ఉత్పత్తి ఉత్పాదకత లో కార్మిక సంఘాల పాత్ర చాలా కీలకమైనది అని సింగరేణి సంస్థ ఉత్పత్తి మరియు ఉత్పాదకత లోనే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి కూడా ఎక్కువ ప్రదాన్యతను ఇస్తుంది అని తెలిపారు. ఈ సమావేశంలో ఈ క్రింది అంశాలపై చర్చించడం జరిగింది. 1. యాక్టింగ్ క్లర్క్‌లను క్రమబద్ధీకరణ చేయాలి 2. సెక్యూరిటీ గార్డుల ఖాళీలను అంతర్గత అభ్యర్థులచే భర్తీ చేయాలి. 3. పెండింగ్‌లో ఉన్న NOC లను వెంటనే క్లియర్ చేయాలి. 4. ఉద్యోగులు తక్కువ గ్రేడ్ నుండి ఉన్నత స్థాయి గ్రేడ్ కు మారినప్పుడు వారికి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. 5. రాష్ట్ర లేబర్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న డ్రిల్ ఆపరేటర్ల కేడర్ స్కీమ్ కేసును (కేసు నం. 109/2014) పరిష్కరించాలని. 6. బొగ్గు ఉత్పత్తి ని సింగరేణి ఉద్యోగులు మాత్రమే నిర్వహించాలి. 7. కారుణ్య నియమకాలు: I. గని ప్రమాధాలలో మరణించిన వ్యక్తుల వారసులకు సర్క్యులర్ నెం.CRP/PER/IR/S/554/2579, తేదీ. 11.12.2009 ప్రకారం వారికి గల విధ్యార్హతల ప్రకారం తగిన ఉద్యోగం కల్పించాలి మరియు డిగ్రీ అర్హతలో ఎటువంటి వ్యత్యాసం లేకుండా చేర్చాలి. II. కుమారులు మరియు కుమార్తెలతో సమానంగా, అల్లుడికి కూడా కారుణ్య నియమాకాన్ని సంవత్సరం లోపు ధరఖాస్తు చేసుకొని పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి.
పైన చర్చించిన అంశాలపై త్వరలో సానుకూలముగా నిర్ణయం తీసుకుంటామని డైరెక్టర్ ‘పా’ గౌతమ్ పొట్రు, తెలిపారు. అదే విధముగా విధులకు గైర్హాజరు అయ్యే ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులతో కలసి కౌన్సెల్లింగ్ నిర్వహించాలని తద్వారా ఉద్యోగి రోజువారిగా విధులకు హాజరయ్యేలా చూడటం లో, భూగర్భ గనులలో ఉద్యోగుల మాస్టర్ల శాతం పెరిగేలా మరియు రక్షణ సూత్రాలు పాటిస్తూ, బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయటంలో సంస్థకు సహాయ సహకారాలను అంధించాలని డైరెక్టర్ ‘పా’ గౌతమ్ పొట్రు, గుర్తింపు కార్మిక సంఘం వారిని కోరారు.
ఈ సమావేశంలో యజమాన్యం తరపున డైరెక్టర్ ‘పా’ గౌతమ్ పొట్రు, ఐఏఎస్, జిఎం( పర్సనల్) ఐఆర్&పిఎం కవితా నాయుడు, జిఎం(సిపిపి) ఏ.మనోహర్, జిఎం(ఫైనాన్స్) ఎం.సుబ్బా రావు, జిఎం(యూజి మైన్స్) వై. రఘు రామి రెడ్డి, జిఎం(పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్, హెచ్‌ఓడి(ఎంఎస్) బి.రవి, హెచ్‌ఓడి(సివిల్) డి.వెంకటేశ్వర్లు, డిజిఎం(హెచ్‌ఆర్‌డి) రఘు కుమార్, ఏజిఎం(పర్సనల్) జి.రాజేంద్ర ప్రసాద్, ఏజిఎం(ఎంఎస్) వెంకయ్య, డిజిఎం(పర్సనల్) లు కే.అజయ్ కుమార్, వైవిఎల్ వరప్రసాద్, బి.రాజగోపాల్, కేసా నారాయణ రావు, ముకుంద సత్యనారాయణ, మరియు ఇతర అధికారులు గుర్తింపు సంఘం తరపున (ఏఐటియుసి) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, కేంద్ర ఉపాధ్యక్షులు వంగ వెంకట్, ఎండి.అక్బర్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శులు కే.సారయ్య, వై.వి.రావు, కందికట్ల వీరభద్రం, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ సెక్రటరీ వై.రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ