తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 4(తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల కేంద్రంలో బర్రెలకు, ఆవులకు, ఎద్దు ల కొమ్ములకు కు జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రాసేన రెడ్డి మరియు సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ కలిసి ఈ రోజు రేడియం స్టికర్స్ అతికించడం జరిగింది. రాత్రి వేళల్లో బర్రెలు, ఆవులు మరియు ఎద్దులును రోడ్ల మీద వదిలేయడం వలన రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులకు ఈ పశువులు కనిపించక వాటిని వచ్చి సడెన్ గా ఢీ కొట్టడం వలన వాహనదారులు గాయాల పాలవుతున్నారు మరియు చనిపోవడం జరుగుతుంది అదే విధంగా పెద్ద పెద్ద వాహనాలు ఢీ కొట్టడంతో పశువులు కూడా చనిపోయి రైతులకు ఆర్థికంగా ఈబంది పడుతున్నారు కావున రాత్రి వేళల్లో రోడ్డు మీద పశువులు వాహన దారులకు కనిపించే విధంగా ఈ రోజు జూలూరుపాడు మండల కేంద్రంలో పశువులకు రేడియం స్టిక్కర్స్ అతికించడం జరిగింది. కావున జూలూరుపాడు ప్రజలు అందరు ఆవులు, గేదెలు కలిగివున్న రైతులందరూ మీ పశువులకు రేడియమ్ తో కూడిన పెయింట్ గాని స్టిక్కర్ అతికించుకోవాలి మరియు రాత్రి వేళల్లో పశువులను రోడ్డు మీద వదలకూడదు ఎవరేనా రోడ్డు మీద వదిలి వాటి వల్ల వాహనదారులకు ప్రమాదం జరిగినట్లఐతే వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోబడును అని మీడియా ద్వారా జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రాసేనా రెడ్డి , మరియు సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ లు హెచ్చరికలు జారీ చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ