తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 21 తెలుగు వెలుగు) : ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం బాబు క్యాంప్ బృందావనం పార్కులో గురూజీ మనోహర్ ఆధ్వర్యంలో యోగ క్లాసులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యోగా గురువులు మనోహర్ మాట్లాడుతూ ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా 2016 న సింగరేణి ఆధ్వర్యంలో ప్రారంభమైన యోగా క్లాసులు ఇప్పటివరకు దశాబ్ద కాలం పాటు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. రోజు యోగా సాధన చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత మరియు ఏకాగ్రత పెరుగుతాయని ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా వారు సింగరేణి సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ