తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పలు చోట్ల నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న నాగా సీతారాములు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన పోటీల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఆ పరమాత్ముడి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో, అష్ఠఐశ్వర్యాలతో ఉండాలని కోరుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ