తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భవిష్యత్తు తరాల కు సికిల్ సెల్ వ్యాధి రాకుండా కాపాడుకుందాం Dr తుకారామ్ రాథోడ్ DMHO ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సుల్హానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన శిబిరం మరియు స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డా. కె. దినేష్, ప్రోగ్రామ్ ఆఫీసర్ (SCD), మానస్త్య ఫౌండేషన్ సభ్యులు డా. గిరిరాజ్ చందక్, శ్రీమతి మనీషా, శ్రీమతి పుణ్యశ్రీ పాల్గొని సికిల్ సెల్ వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, స్క్రీనింగ్, జన్యు (Gene) పరీక్షలలో వస్తున్న ఆధునిక పద్ధతుల గురించి వివరించారు. అలాగే సికిల్ సెల్ స్క్రీనింగ్ పరీక్ష విధానాన్ని వీడియో ప్రదర్శన ద్వారా వివరించి ప్రజల్లో అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "2047 నాటికి సికిల్ సెల్ వ్యాధి నిర్మూలన" లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకొని కార్యక్రమానికి సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు. జిల్లాలో సికిల్ సెల్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 2,80,700 మందికి POC పరీక్షలు నిర్వహించగా, 3,450 మంది క్యారియర్లు మరియు 687 మంది సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. అలాగే 6,341 మందికి HPLC పరీక్షలు నిర్వహించి, 1,900 మంది క్యారియర్లు మరియు 135 మంది సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులను నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో Dr వెంకటేష్ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు PHC సుల్హానగర్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ