తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బహుజనులకు రాజ్యాధికం దక్కేవరకు పోరాడుతాం : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ బహుజనులకు రాజ్యాధికారం దక్కేవరకు పోరాడుతామని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (JBP) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.శనివారం పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కామేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమసమాజ స్థాపకుడు,బహుజన వర్గాల ఆశాజ్యోతి,భారత రాజ్యాంగ నిర్మాత,అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్త,న్యాయకోవిదుడని అంటరానితనం,కుల వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు.భారత రాజ్యాంగానికి ముందు మనువాద సమాజంలో స్వేచ్ఛగా మంచినీళ్లు కూడా తాగే పరిస్థితి లేని,మనుషులుగా గుర్తింపు లేని వర్గాల ప్రజలను రాజ్యాధికారం వైపు నడిపించడం కోసం,ఉన్నతమైన పదవులలో ఉంచడం కోసం తాను నిలువునా కొవ్వొత్తిలా కరుగుతూ అణగారిన వర్గాల వారిని అధికారంలో ఉంచడం కోసం ఓటు హక్కును సాధించి మన విలువను పెంచిన మహా దేవుడు అన్నారు.ఆయన రచించిన భారత రాజ్యాంగం ఈదేశ ప్రజలకు రక్షక కవచమని,రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత అని ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.ఆయన ఆశయాలు సాధించడం,ఆయన ఆలోచన విధానాన్ని అందరికీ తెలియజేయడం ద్వారా సమాజంలో మార్పును తేవడం మన కర్తవ్యమన్నారు.నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాలోతు వీరు నాయక్,కొత్తగూడెం అసెంబ్లీ అధ్యక్షులు నాగుల రవికుమార్,వినయ్,గజ్జెల శంకర్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ