తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.ప్రత్యేక ప్రార్థనలతో సమాజంలో శాంతి సౌభాగ్యాలు వికసిస్తాయి.మతసామరస్యానికి ప్రతీకగా మొహరం వేడుకలు నిలుస్తాయి.పవిత్రమైన రోజుల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలి.ప్రతి ఒక్కరూ సోదరభావంతో పండుగను జరుపుకోవాలి.ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుంది.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.పాతకొత్తగూడెంలోని హజరత్ అలీ అబ్బాస్ ఆషూర్ కనాను సందర్శించిన సాబీర్ పాషా. మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనమని, ఈ పండుగ విశిష్టతను ప్రతి ఒక్కరూ చాటిచెప్పాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. ఈ నెల 26న జరగనున్న మొహరం పండుగను పురస్కరించుకుని జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాల నేపథ్యంలో ఆదివారం పాతకొత్తగూడెంలోని హజరత్ అలీ అబ్బాస్ ఆషూర్ కనాను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ... మొహరం పండుగ రోజుల్లో నిర్వహించే ప్రత్యేక పూజల వల్ల సమాజంలో శాంతి సౌభాగ్యాలు వికసిస్తాయని, లోకకల్యాణం జరుగుతుందని ఆకాంక్షించారు. ఈ వేడుకలు గంగా-జమునా తెహజీబ్‌కు, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. పవిత్రమైన ఈ రోజుల్లో భక్తులందరూ భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ సోదరభావంతో పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతోనే ప్రతి మానవుడికి మానసిక ప్రశాంతత లభిస్తుందని, సమాజంలో ఐక్యత పెరుగుతుందని వివరించారు. ఆషూర్ కనా కమిటీ నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కార్యక్రమంలో నయీమ్ ఖురేషి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, పడాల భవాని, రామారావు, సాంబిరెడ్డి, ఇమ్రాన్, జమాలుద్దీన్, మొహమ్మద్ అలీ, జడల అరుణ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ