తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టేకులపల్లి మండలంలోని పాత లచ్చగూడెం వద్ద పూనెం కృష్ణ (28) అనే యువకుడు బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తగూడెం వెళ్లి వస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణ తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు. మృతుడి భార్య పేరు స్వప్న అని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ