తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామం నందు గల సమ్మక్క సారలమ్మ ల జాతరను జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ బాధావత్ రవి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో గ్రామస్తులు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో డోలు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా వనదేవతల జాతర లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై రవి మాట్లాడుతూ వనదేవతల కరుణాకటాక్షాలతో మండలంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని కోరుకుంటూ, మొక్కులు చెల్లించటానికి వచ్చినటువంటి భక్తులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరపకుండా అమ్మవారులకు మొక్కులు చెల్లించుకుని తల్లుల దీవెనలు పొందగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సులూరుపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ