Monday, 20 April 2026 01:33:59 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 27 May 2025 07:19 PM Views : 456

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : వర్షాకాలంతో వచ్చే సీజనల్ వ్యాధులను నియంత్రణకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వైద్య శాఖ అధికారుల తో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యశాఖ అధికారులు జిల్లాలో సీజనల్ వ్యాధులు నియంత్రణకు చేపడుతున్న చర్యలు, తీసుకుంటున్న జాగ్రత్తలు గురించి కలెక్టర్ కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వానకాలంలో మలేరియా, పైలేరియా, మెదడు వాపు, డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్‌, డయేరియా, అతిసార వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. పరసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. వర్షపు నీటిని నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.నీరు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రాంతాల్లో మలేరియా వ్యాధిని వ్యాప్తి చెందించే దోమలు పెరుగుతాయని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. అపరిశుభ్రత దృశ్య సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం లేకుండా, ప్రతి డ్రైన్ ను శుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ ను తొలగించడం, బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం చేయాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించి శుభ్రం చేయడంతో వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. శుభ్రమైన ఆహారాన్ని తినాలని, ఆకు కూరలు, కూరగాయలు వండే ముందు శుభ్రంగా కడగాలని, ఉడికించిన ఆహారాన్ని తినాలని ప్రజలకు అవగాహన కల్పించాలి. ఫీవర్ సర్వే, చేయాలని వైద్య శిబిరాల నిర్వహణ చేయాలని ఆయన తెలిపారు. అన్ని ఆసుపత్రులలో వ్యాధి నిర్ధారణ కిట్లు మరియు మందులు అందుబాటులో ఉంచాలి అని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వున్న అన్ని పాఠశాలలో విద్యార్థులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి, నిర్వహించిన పరీక్షల వివరాలు రిజిస్టర్ లో నమోదు చెయ్యాలి.అశ్వస్తకు గురి అయిన విద్యార్థులకు తగిన వైద్యం అందించాలి. వసతి గృహలలో కిచెన్ షెడ్ లు మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నియంత్రణపై వాట్సాప్ సందేశాలు గ్రూపుల్లో పోస్ట్ చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు సూచించారు.ఎక్కడైతే నీరు నిల్వలు ఉంటాయో అక్కడ ఇంకుడు గుంతలు నిర్మాణాలు మరియు అజోళ్ల పెంపకం చేపట్టాలి. ఈ కార్యక్రమంలో టీడీ ట్రైబల్ వెలఫైర్ మణెమ్మ, జిల్లా వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్,డీసీ హెచ్ ఓ రవిబాబు,జిల్లా విద్య శాఖ అధికారి వెంకటేశ్వర చారి,జిల్లా మలేరియా అధికారి స్పందన, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, పాల్వంచ మునిసిపల్ కమిషనర్ సుజాత, మిషన్ భగీదరా ఈ ఈ లు తిరుమలేష్, నళిని, జిల్లా అదనపు వైద్యశాఖ అధికారి జయలక్ష్మి మరియు జిల్లా అధికారులు, జిల్లా వైద్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :