తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 5(తెలుగువెలుగు) : స్థానిక మార్కెట్ ఏరియాలో గల స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ లో శనివారం నాడు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక సందర్భంగా విద్యార్థుల ఆనందం, భావోద్వేగం మిళితమైన అపురూప క్షణాలను అందరూ ఆస్వాదించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ జి భాస్కరరావు, ప్రిన్సిపాల్ జి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఎదురు అయ్యే ప్రతి సవాలను అవకాశంగా మార్చుకొని తమ కల లను నిజం చేసుకోవాలని, తమకున్న క్రమశిక్షణ ధైర్యం సమర్థత విజయానికి మార్గదర్శకాలు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఈ పాఠశాలలో పొందిన జ్ఞానం తమకు భవిష్యత్తులో మార్గ నిర్దేశం చేస్తుందని ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎప్పటికీ గుర్తుండి పోతుందని,ఈ పాఠశాలతో ఏర్పడిన అనుబంధం, పొందిన విద్య విలువలు ఆటలు పరీక్షల ఒత్తిళ్లు టీచర్ల శిక్షలు మరచిపోలేని మధురస్మృతులు గా మిగిలిపోతాయని భవిష్యత్తుకు బలమైన పునాదులు అవుతాయని భావోద్వేగంతో తెలియజేసినారు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి... పాట ప్రదర్శన ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసినది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ