తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లాకు రానున్న ఇందిరమ్మ చీరలను నిల్వ చేయడానికి 6 గోదాంలను సిద్ధం చేసినట్లు DRDA ఎం.విద్యా చందన తెలిపారు. కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఈ గోదాంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఒక్కో గోదాంలో 30 వేల నుంచి 60 వేల వరకు చీరలను నిల్వ చేయనున్నామని ఆమె వెల్లడించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ