Monday, 20 April 2026 01:48:52 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

రాజీవ్ యువ వికాసం అర్హుల జాబితా రూపొందించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 22 April 2025 07:33 PM Views : 574

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 22 (తెలుగు వెలుగు) : రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో రాజీవ్ వికాసం దరఖాస్తుల పరిశీలన మార్గదర్శకాలపై సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకు మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి జాబితా రూపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, బ్యాంకు మేనేజర్లు కమిటీ సభ్యులు తమ మండలాల్లోని కార్యాచరణ రూపొందించుకొని ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారి జాబితా రూపొందించాలన్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా జరగాలని అనంతరం జిల్లా స్థాయి కమిటీకి జాబితాలో అందించాలని ఆదేశించారు. బ్యాంకర్లు సమన్వయంతో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పుస్తకం, సదరం సర్టిఫికెట్ మరియు ఇతర దృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. జనాభా ప్రాతిపదిక కలిగిన యూనిట్ల కేటాయింపు ఉంటుందని, ఓకే గ్రామంలో ఒక యూనిట్కు ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకుంటే వాటిని పరిశీలించాలని, ఆయా కార్పొరేషన్ల అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో పాల్గొనాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ సంబంధిత యూనిట్ల స్థాపనకు ప్రజలకు అవగాహన కల్పించాలని, చేపల పెంపకం యూనిట్లను ఈ పథకం ద్వారా స్థాపించడం ద్వారా వారి యొక్క ఆర్థిక పురోగతి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా పాడి పరిశ్రమలు స్థాపనకు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. యువ వికాసం అమలకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో సిపిఓ సంజీవరావు, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు మరియు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :