తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 11 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం నందు కార్తీక మాసం సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అట్టహాసంగా వన సమారాధన కార్యక్రమం జరిగినది. ఈ వన సమారాధన కార్యక్రమం నాయి బ్రాహ్మణులంతా దత్త నగర్ నుండి ర్యాలీగా బయలుదేరి ఊరి చివరన మామిడి వనం లోకి సమూహంగా వెళ్లారు. అనంతరం వనంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఆటపాటలతో రోజు మొత్తం ఆనందోత్సాహంగా గడిపారు. వనంలోనే సామూహికంగా భోజనాలు చేసి సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు కడియాల సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యుడు మాడుగుల నాగరాజు, వి రమేష్, కే పుల్లయ్య, కే శ్రీను, కే నరేష్, కే సైదులు, ఎం నరేష్, కే నాగేశ్వరరావు, నాగరాజు, నరేష్ మరియు నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ