తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆపరేషన్ సింధూర్ విజయం అనంతరం మొదటి సారి వచ్చే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం ని పెద్ద ఎత్తున నిర్వహించలి అని బీజేపీ జాతీయ పార్టీ నిర్ణయం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం తీసుకోవటం జరిగింది ఆగష్టు 15 వరకు ప్రజల్లో దేశ భక్తిని రగలించటం ఆపరేషన్ సింధూర్ ద్వారా మన భారత్ ఆర్మీ చూపించిన తెగువ పరక్రమం ధైర్య సాహసాలు యావత్ ప్రపంచం ప్రశంశించటం జరిగింది మరొక్క సారి దేశ ప్రజలు ఆర్మీ జవాన్ లని కీర్తిస్తూ భారత దేశ ఐక్యతను మరో సారి చాటటానికి ఈ రోజు భద్రాద్రి జిల్లా బీజేపీ హర్ ఘర్ తిరంగా కార్యశాల పాల్వంచ నెహ్రూనగర్ మినీ ట్యాంక్ బండ్ శ్రీ లక్ష్మి లేక్ వ్యూ మినీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లో జిల్లా లో కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. ఈ నెల 11 మరియు 12న మండల జిల్లా కేంద్రాలలో తిరంగా ర్యాలీ లు 13 నుండి 14 వరకు స్వతంత్ర సంగ్రమం చారిత్రాత్మక ప్రదేశాలు చిహ్నం లు స్వతంత్ర వీరుల విగ్రహాలు ఉన్న ప్రదేశాలలో స్వచ్చ భారత్ నిర్వహించడం అమరులు అయిన సైనుకుల పోలీస్ ల కుటుంబం ల సన్మానం ఇంటింటికి జాతీయ జండాలు పంపిణి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఏగారవేయించటం దేశ విభజన జరిగిన ఆగష్టు 14 న మౌన ప్రదర్శన ఆగష్టు 15 న ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయటం తదితర కార్యక్రమం లు ఇవ్వటkarజరిగింది కార్యక్రమం లు అన్ని విజయవంతం గా నిర్వహించాలి అని రేపు అన్ని మండల కేంద్రం లలో వర్క్ షాప్ నిర్వహించాలి అని మండల అధ్యక్షుల కి దిశా నిర్దేశం చేయటం జరిగింది. కార్యక్రమం లో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు జీవీకే మనోహర్, KV రంగా కిరణ్, జల్లారపు శ్రీనివాస్, గొడుగు శ్రీధర్ పాల్వంచ అధ్యక్షులు రాపాక రమేష్ జిల్లా లోని మండల అధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ