తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు జీవనోపాధుల అభివృద్ధి కార్యక్రమాల కింద జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కౌజు పిట్టల యూనిట్లను గ్రౌండింగ్ చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామంలో కౌజు పిట్టలు మరియు పోటేళ్ల పెంపకం యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (DPM) సుమక్క, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (APM) వెంకయ్య, మండల APM వరంకటేశ్వరరావు మరియు సీసీలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ