Sunday, 19 April 2026 02:48:48 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

గోదావరి పుష్కరాల నాటికి ఆలయ తొలి దశ అభివృద్ధి పనులు పూర్తి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.

Date : 27 March 2026 05:49 PM Views : 127

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం. గోదావరి పుష్కరాల నాటికి ఆలయ తొలి దశ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ తెలిపారు.శుక్రవారం భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనంతరం మంత్రివర్యులు కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ భద్రాచలంలోని శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి ప్రాముఖ్యత ఉందని, దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు శ్రీ సీత రామచంద్ర స్వామి కళ్యాణాన్ని వీక్షిస్తారని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడవ సంవత్సరం మంత్రిగా తాను ఈ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం, స్థానిక మంత్రి వర్యుల సహకారంతో స్థానికంగా అవసరమైన భూ సేకరణ చేసిన తర్వాత, రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి విడత క్రింద భద్రాచలం ఆలయానికి 351 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు.గోదావరి పుష్కరాల సమయానికి ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు దేవాదాయ శాఖ కృషి చేస్తుందని అన్నారు. తర్వాత రెండవ విడత నిధులు విడుదల చేసుకొని కృష్ణ పుష్కరాల నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. నేడు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులందరికీ శ్రీ రామచంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి శ్రీరామచంద్రమూర్తి శక్తిని కల్పించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆశీర్వదించాలని మంత్రి కోరారు.ఈ ప్రెస్ మీట్ లో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :