తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) లో స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ యువతకు మంచి అవకాశాలు కల్పిస్తున్నదని తెలిపారు.విద్యార్థులు ఈ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మెచ్చు ఈదప్ప , మడకం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ