తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారధ్యంలో.. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో.. ఈనెల 12న తలపెట్టిన జాబ్ మేళాను 16వ తేదీకి మార్చబడిందని నిర్వాహకులు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ పక్కనగల కొత్తగూడెం క్లబ్లో మేళా ఉంటుందని చెప్పారు. పది నుంచి పీజీ వరకు చదివిన వారు అర్హులని చెప్పారు. 65+ కంపెనీల్లో 3,500 ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నారు. ట్రాన్స్ జెండర్, చెవిటి, మూగ, దివ్యాంగులకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఉ.9 నుంచి సా.5 గంటల వరకు హాజరవ్వాలన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ