Wednesday, 15 April 2026 05:21:59 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 13 April 2026 01:45 PM Views : 76

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సోమవారం జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్వంచ మండలంలోని బోల్లారి గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించి, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు. తనిఖీలలో భాగంగా పరీక్ష హాళ్లలో విద్యార్థుల కూర్చునే విధానం, ప్రశాంత వాతావరణం, తగిన వెలుతురు, తాగునీటి సదుపాయం, విద్యుత్, ఫ్యాన్లు, శుభ్రత వంటి మౌలిక వసతులను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి సరైన దూరం పాటిస్తూ కూర్చునేలా చర్యలు తీసుకోవాలని, పరీక్ష సమయంలో ఎటువంటి అంతరాయాలు లేకుండా అన్ని ఏర్పాట్లు సమర్థంగా ఉండాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రాల పంపిణీ, సమాధాన పత్రాల సేకరణ, భద్రపరిచే విధానం వంటి అంశాలను పరిశీలించి, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాతత పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని, మాల్ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లు, సిబ్బంది తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని, విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తూ సహాయకరంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రత్యేకంగా విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా, ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ తనిఖీలు కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయురాలు మంగమ్మ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :