Sunday, 19 April 2026 02:08:45 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ఎస్ ఆర్ కే టి స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాలు.

Date : 19 July 2025 06:58 PM Views : 527

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జూలై 20 ( ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మేధర బస్తి ఎస్ ఆర్ కె టి స్కూల్ లో ఘనంగా ఆషాడ బోనాల. సంబరాలు నిర్వహించడం జరిగింది .చిన్నతనం నుండే విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఉద్దేశంతో మేదర బస్తి ఎస్సార్ కే టి స్కూల్లో చిన్నారులచే దుర్గమ్మ తల్లికి ఆషాడ మాస బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఎల్కేజీ ,యూకేజీ మొదలు ప్రీమియం తరగతుల విద్యార్థులు తాము ఆరోగ్యంగా ఉండాలి,చదువులు బాగా రావాలని అమ్మ వారికి బోనమెత్తారు.మట్టి కుండల్లో నైవేద్యాన్ని ఉంచి, పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించారు .ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో అమ్మలను గన్న అమ్మ శ్రీ దుర్గమ్మవారికి బోనాలను సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ హాజరయ్యారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు డైరెక్టర్లు ఘనంగా మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిని బొకేతో స్వాగతం పలికి బోనాలు ఎత్తుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి వద్దకు స్కూల్ యజమానులతొ కలిసి బోనాలు సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ లలో బోనాల జాతర అత్యంత పవిత్రంగా జరుగుతుందని అదేవిధంగా ఆషాడ మాసం ఊరురా జరుపుకునే సాంప్రదాయ పండుగ బోనాల పండుగ అని అన్నారు. కొత్తగూడెంలో ఎస్ ఆర్ కె టి స్కూల్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు అని పేర్కొన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని అలాంటి రైతుకు పంటలు బాగా పండి సంతోషంగా జీవించేలా చల్లగా చూడమ్మా అంటూ అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి వేషాధారణలో చిన్నారి శాన్వి సహోజ్, నృత్య ప్రదర్శనలో పోతురాజులు ఆకర్షణీయంగా నిలిచారు. నర్సరీ నుండి మొదలుకొని పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు టీచర్లు అందరూ కలిసి సంతోషంగా నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. అనంతరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాపు సీతాలక్ష్మిని ఎస్ ఆర్ కే టి ప్రధానోపాధ్యారాలు డైరెక్టర్లు ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేధార్ బస్తి ఎస్సార్ కే టి స్కూల్ డైరెక్టర్స్ కోట్ల రామరాజు, గుగులోత్ హతీరామ్, ప్రిన్సిపాల్ స్వర్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :