తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ జిల్లా నాయకులు మునీర్ - యూరియా కొరతతో రైతులు గోసపడుతున్నారని జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు మునీర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న రైతులు యూరియా కోసం బారులు తీరటం విడ్డూరంగా ఉందని, రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రేవంత్ సర్కార్ పై రైతులు తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్రంలో ఎ ఎన్నికలు జరిగినా రేవంత్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాదిస్తుందని, ప్రజల పక్షాన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడానికి బిఆర్ఎస్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉందన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ