తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాలోని ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ కార్యాలయం నందు సివిల్ ఇంజినీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి మరియు 58 వ ఇంజనీర్స్ డే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఏం షాలెం రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలతో వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వేడుకలలో పాల్గొన్న ఇంజనీర్ లను, ఇతర అధికారులను ఉద్దేశించి జిఎం మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చాలా నిరాడంబరమైనటువంటి స్థాయి నుంచి ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీర్లలో ఒకరుగా ఎదగడం భారతదేశానికి ఎంతో గర్వకారణం అన్నారు. భారతదేశం యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజనీర్స్ డే గా నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకమని, అదేవిధంగా ప్రస్తుత యువత మోక్షగుండం విశ్వేశ్వరయ్య ని స్ఫూర్తిగా తీసుకొని ఇంజనీరింగ్ లో ప్రగతిని తీసుకురావడానికి తమ వంతు కృషి చేయడానికి పూనుకోవాలన్నారు. ఈనాడు భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంజనీరింగ్ ప్రాజెక్టులను చేపట్టడం కోసం పునాదులు వేయడం మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో కూడా సాగిందని చెప్పుకోవచ్చు అని తెలియజేశారు. ప్రతీ ఏడాది ఒకొక్క థీమ్ తో ఈ యొక్క ఇంజనీర్స్ డే చేసుకుంటున్నామని, ఈ ఏడాది “ డీప్ టెక్ & ఇంజనీరింగ్ ఎక్సలెన్స్: డ్రైవింగ్ ఇండియాస్ టెక్డేడ్ ( “Deep Tech & Engineering Excellence: Driving India's Techade.”) అనే థీమ్ తో నిర్వహించుకుంటున్నామని, అదే విధముగా ఇంజనీర్లు ప్రస్తుతం ఉన్న నూతన టెక్నాలజీలను ఉపయోగిస్తూ విలువలతో కూడిన ఇంజనీరింగ్ పని తనం తో నాణ్యమైన ప్రాజెక్టులను నిర్మించి భావి తరాల వారికి అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం (ఏఐటియూసి) బ్రాంచ్ సెక్రటరీ వి. మల్లికార్జున రావు, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టియూసి వైస్ ప్రెసిడెంట్ ఎండి. రజాక్, సిఎంఓఏఐ జాయింట్ సెక్రెటరీ ఏ ఉపేంద్ర బాబు, ఏరియా ఇంజనీర్ కే సూర్యనారాయణ రాజు, ఎజిఎం(సివిల్) సిహెచ్. రామకృష్ణ, ఇంచార్జ్ ఎస్ ఓ టు జి ఎం.వెంకటేశ్వర్లు, డిజిఎం(పర్సనల్)జి.వి మోహన్ రావు, ఇతర వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ