తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఒక్క ఛాన్స్ ఇస్తే కార్పొరేటర్ గా గెలుస్తామంటు అప్లికేషన్ ఇచ్చేందుకు వచ్చిన పలువురు కాంగ్రెస్ డివిజన్ నాయకుల నుండి జిల్లా పార్టీ కార్యాలయంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు దరఖాస్తులు తీసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన తమకు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే అవకాశం కల్పించాలంటు పోటీ పడుతున్న వారి నుండి అప్లికేషన్ లు స్వీకరించిన నాగా సీతారాములు అర్హులైన వారికి పార్టీ బి ఫామ్ ఇస్తుందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సమిష్టిగా పని చేయాలని, అధిష్టానం సర్వే ద్వారా అభ్యర్థుల ఎంపికను నిర్ణయిస్తుందని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం కదం తొక్కుదామని, ప్రజా ప్రభుత్వంలో పేదల కోసం తీసుకొచ్చిన పథకాలు అమలు చేస్తున్న సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ