తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : కుటుంబ కలహాలతో ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రఘునాథపాలెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా. పంగిడికి చెందిన భూక్య కుమార్(29) అతని భార్యకు మధ్య ఇటీవల గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. మనస్థాపానికి గురైన కుమార్ గడ్డి మందు తాగగా. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, కూతురు (4) ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ