తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాలోని NCWA ఉద్యోగులకు క్వార్టర్స్ కౌన్సిలింగ్ ను నిర్వహించడం జరిగింది. క్వార్టర్స్ కౌన్సిలింగ్ కు 76 మంది ఉద్యోగులు దరఖాస్తులు చేసుకొగా వారి యొక్క అర్హత, కేటగిరి, పదవిని బట్టి పూర్తి పారదర్శకతతో వారికి క్వార్టర్స్ కౌన్సిలింగ్ ను నిర్వహించి వారికి క్వార్టర్స్ ను కేటాయించటం జరిగింది. 76 దరఖాస్తులకు గాను 29 మంది వారి అర్హతకు తగిన క్వార్టర్స్ ను తీసుకోగా, 03 మంది కౌన్సిలింగ్ కి హాజరై క్వార్టర్స్ తీసుకోలేదు మరియు 44 మంది కౌన్సిలింగ్ కు హాజరు కాలేదు. ఈ కార్యక్రమంలో డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, పాటు కొత్తగూడెం ఏరియా ఏ.ఐ.టి.యు.సి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జె. గట్టయ్య, ఐ.ఎన్.టి.యు.సి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, డివైపిఎం జి. హరీష్ మరియు ఆఫీస్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, క్వార్టర్స్ కౌన్సిలింగ్ కు హాజరైన ఉద్యోగులు పాల్గొనడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ